

మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రతి టిమ్స్ ఆసుపత్రిని రూ.1200 కోట్లతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులకు సమానంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు ప్రారంభించారని చెప్పారు. సనత్ టిమ్స్ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ నాలుగు వైపులా టిమ్స్ ఆసుపత్రులను ప్రణాళికాబద్ధంగా ప్రారంభించారని, పాత ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇవి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేవని కేటీఆర్ అన్నారు. రాజకీయ కారణాలతో పనులను ఆలస్యం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ, సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్, గచ్చిబౌలి టిమ్స్, ఎంజీఎం వరంగల్, నిమ్స్ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!