

కె.టి. రామారావు భారతదేశపు తొలి స్పేస్-టెక్ యూనికార్న్‌గా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 1 బిలియన్ డాలర్లకు పైగా విలువ సాధించి భారత అంతరిక్ష సాంకేతిక రంగంలో చరిత్ర సృష్టించిన స్కైరూట్ విజయాన్ని తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు గర్వకారణంగా అభివర్ణించారు. హైదరాబాద్ కేంద్రంగా, టీ-హబ్‌లో ప్రారంభమైన ఈ సంస్థ తక్కువ సమయంలోనే ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు.
స్కైరూట్ విజయం భారతీయ ప్రతిభ, ఆశయాలకు నిదర్శనమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సంస్థ సహ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకాతో పాటు మొత్తం బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ తెలంగాణ, భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్కైరూట్ ఎదుగుదల దేశీయ స్టార్టప్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!