

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆయన తల్లి శ్రీమతి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు.
పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!