

దేశవ్యాప్తంగా ‘ఇండీ’ కూటమి చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ మార్చ్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఈ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాకుండా కుటుంబ, వారసత్వ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేపట్టిన కార్యక్రమమని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఓటములను అంగీకరించలేకే కాంగ్రెస్ నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్, ఓటు చోరీ వంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా డూప్లికేట్, మృతుల ఓట్లను తొలగించడాన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైనా లక్ష్మణ్ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రంలో ‘ఆర్‌ఆర్ రాజ్యాంగం’ నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కనిపించడం లేదా అని నిలదీశారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా ప్రక్షాళన, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!