

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. దీంతో శనివారం జరగనున్న మూడో వన్డేలో ప్రపంచకప్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని భిన్నమైన కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది. భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె ఒకటి, రెండు మార్పులు చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. మహ్మద్ సిరాజ్‌తో పాటు నితీశ్ కుమార్ రెడ్డిని కూడా జట్టులోకి తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ప్రణాళికల్లో నితీశ్ ఉంటే అతడికి ఇప్పుడే అవకాశమిచ్చి ఆత్మవిశ్వాసం పెంచడం కీలకమని రహానె పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ కోసం ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్న రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీని మార్చాల్సిన అవసరం లేదని చెప్పాడు.
మరోవైపు భారత మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కూడా మూడో వన్డేలో మార్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. నామన్ ధీర్ గాయం కారణంగా మార్పు తప్పనిసరి కావచ్చని, పేసర్లలో ఒకరికి విశ్రాంతినిచ్చి సిరాజ్‌ను ఆడించే అవకాశం ఉందని చెప్పాడు. నితీశ్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్‌లలో కొందరికి అవకాశం ఇవ్వవచ్చని కార్తీక్ సూచించాడు. అయితే సిరీస్‌ను పూర్తిగా గెలుచుకునే ఉద్దేశంతో అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని తెలిపాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!