

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అల్పాహార పథకం కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు హరే కృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి. నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుకు రూ.5.17 కోట్ల చెక్కును జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రతినిధులు, వికారాబాద్‌లో కిచెన్ నిర్మాణానికి రూ.4 కోట్ల చెక్కును చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు అందించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఆహారంలోని పోషక విలువలు, క్యాలరీలను లెక్కించేందుకు యాప్‌లను వినియోగించాలని, ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రాంతాల వారీగా స్థానిక ఆహార అలవాట్లకు అనుగుణంగా అల్పాహారం తయారు చేయాలని, సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని అన్నారు. నవంబర్ 30లోగా కిచెన్ల నిర్మాణం పూర్తి చేసి, డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!