

‘ఉప్పెన’, ‘పెద్ది’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా తన మూడో సినిమాను కూడా మెగా కాంపౌండ్‌లోనే చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని బుచ్చిబాబు డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బలమైన భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలను మేళవించే బుచ్చిబాబు శైలిలో ఈ సినిమా ఉండొచ్చనే ప్రచారంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
చిరంజీవి కోసం బుచ్చిబాబు ఎలాంటి కథను సిద్ధం చేశారనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ, నిర్మాణ సంస్థ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ముఖ్యంగా ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మెగా అభిమానులు ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!