
జనరల్

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ “కాక్రోచ్ జనతా పార్టీ”కి పాకిస్థాన్‌తో పాటు బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుంచి మద్దతు లభిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి.
అయితే ఈ ఆరోపణలను పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. తమ పార్టీకి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదని, రిజిజు చేసిన వ్యాఖ్యలు అసత్యమని ఆయన తెలిపారు. యువతలో అవగాహన పెంపే తమ లక్ష్యమని, తమ సోషల్ మీడియా ఫాలోవర్స్‌లో 94 శాతం మంది భారతదేశం నుంచే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రిజిజు, విదేశీ నెట్‌వర్క్‌లపై ఆధారపడే వారిపై జాలేస్తోందని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!