4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

Writer: Nithish 07:20 AM, 4 అక్టోబర్, 2026
కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు కూడళ్లలో స్టీల్‌ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి చేపట్టిన రూ.1,090 కోట్ల ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. రెండు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనులతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావించి, నెల క్రితం ఆయా మార్గాల్లో వన్‌వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తొలుత వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, మూడో రోజు నుంచి సిగ్నళ్ల వద్ద నిరీక్షణ తగ్గి రాకపోకలు సాఫీగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమైన తర్వాత వందల కోట్లు ఖర్చు చేయడం అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం రూపొందించిన తీర్మానాన్ని శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశం ఆమోదించింది. ప్రత్యేక అధికారి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు గేట్‌, ముగ్దా జంక్షన్‌, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనులను రద్దు చేశారు. కాంట్రాక్టు సంస్థలు కేఎన్‌ఆర్‌, మేఘాతో చేసుకున్న ఒప్పందాల రద్దుకు కూడా ఆమోదం లభించింది. ఇదే సమయంలో పంజాగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్‌ కూడలి నుంచి జూబ్లీ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ రోడ్డును కలుపుతూ 4 కి.మీ పొడవైన ఆరు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌కు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టును డిజైన్లు పూర్తయ్యాక తుది అంచనా వ్యయం ఖరారు చేయనున్నారు. కేబీఆర్‌ ప్రాజెక్టు రద్దైన నేపథ్యంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ మేఘా సంస్థకు అప్పగించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

ట్యాగ్లు
కేబీఆర్ పార్కుహైదరాబాద్ ట్రాఫిక్జీహెచ్‌ఎంసీస్టీల్ బ్రిడ్జిలుఅండర్‌పాస్‌లుట్రాఫిక్ ప్రాజెక్టుజూబ్లీ చెక్‌పోస్టుపంజాగుట్టఎలివేటెడ్ కారిడార్మేఘా సంస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం
జనరల్

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!