

సెప్టెంబర్ 13 భారత క్రీడా రంగానికి చిరస్మరణీయమైన రోజుగా నిలిచింది. హాకీ, క్రికెట్‌లో భారత జట్లు అద్భుత విజయాలు సాధించాయి. జూనియర్ ఆసియా కప్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి. మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్‌ను ఎనిమిదోసారి కైవసం చేసుకోగా.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత పురుషుల జట్టు విజయం సాధించింది. ఈ విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ భారత జట్లను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.
మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ గెలవడం భారత క్రికెట్‌కు గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. టోర్నీ మొత్తం జట్టు ఆత్మవిశ్వాసం, నిలకడ, స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు. ఈ విజయం భవిష్యత్తులో ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. అలాగే జూనియర్ ఆసియా కప్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచిన భారత హాకీ జట్లను అభినందించారు. పురుషుల జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను, మహిళల జట్టు చైనాను ఓడించి టైటిళ్లు సాధించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోవైపు, భారత మహిళల క్రికెట్ జట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, నిబద్ధత, పోరాట పటిమతో జట్టు అద్భుత విజయాన్ని సాధించిందని కొనియాడారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!