
బిజినెస్

తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ స్థాయిలో పరిపాలనా మార్పులు చేపట్టింది. మొత్తం 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శ్వేతారెడ్డిని వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమించగా, రాజేష్ మీనాను వికారాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీగా నియమించారు. సన్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్‌గా, వై. సాయిశేఖర్‌ను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా ప్రభుత్వం నియమించింది.
అదేవిధంగా ఆనంద్ కుమార్‌ను హైడ్రా అదనపు కమిషనర్‌గా, విజయ్ కుమార్‌ను నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్‌గా, చంద్రమోహన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!