

దివంగత నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. త్వరలో విడుదల కానున్న ఎంప్రెస్ – ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి పుస్తకం కవర్‌ను ప్రియాంక షేర్ చేశారు. శ్రీదేవి ఎంతో గుర్తుకొస్తున్నారని, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. త్వరలోనే శ్రీదేవి పుస్తక రూపంలో అభిమానుల ముందుకు రాబోతున్నారని పేర్కొన్నారు.
ప్రియాంక చోప్రా చేసిన ఈ పోస్ట్‌ను శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా రీపోస్ట్ చేశారు. రచయిత ధీరజ్ యు. కుమార్ రచించిన ఈ పుస్తకంలో శ్రీదేవి బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగిన దశ వరకు ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను వివరించనున్నారు. ఈ బయోగ్రఫీని పుస్తకంగా తీసుకురానున్నట్లు 2023లోనే అధికారిక ప్రకటన వెలువడగా, త్వరలో పుస్తకం విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!