

తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో ఏకంగా 21–22 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్‌చార్జి మంత్రులు వెంటనే తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇది తన వ్యక్తిగత ఆదేశం కాదని, ఏఐసీసీ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశమని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో భారీగా ఓట్లు తొలగించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ 73 లక్షల ఓట్ల తొలగింపు, 64 లక్షల ఓట్లను అనామలీస్‌గా గుర్తించడం చాలా తీవ్రమైన విషయమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియను సీరియస్‌గా పర్యవేక్షించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!