
జనరల్

గిల్గిట్-బాల్టిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేతలను పాకిస్థాన్ చర్యలు కప్పిపుచ్చలేవని భారత్ స్పష్టం చేసింది. ఆ ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని, వాటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది.
మరోవైపు పీఓకే అసెంబ్లీలోని 53 స్థానాలకు జూలై 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాక్ అధికారులు ప్రకటించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆక్రమిత ప్రాంతాల్లో పాకిస్థాన్ చర్యలను ఖండించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!