

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే మృతి కేసులో ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను అధికారులు దాదాపు 8–10 గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సెప్టెంబర్ 18న మిడ్-సెమిస్టర్ పరీక్ష సమయంలో సాహిల్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన తర్వాత పరీక్ష హాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12.30 నుంచి 12.45 గంటల మధ్య విద్యార్థి, ప్రొఫెసర్ మధ్య ఏం జరిగిందనే అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
సాహిల్ మృతికి ముందు జరిగిన పరిణామాలు, పరీక్షా విధానం, ప్రొఫెసర్‌తో అతడి సంభాషణ, అలాగే కుటుంబ సభ్యులు చేసిన వేధింపులు, కుల వివక్ష ఆరోపణలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా ఈ ఆరోపణలను ఖండిస్తూ, సంస్థ నిబంధనల ప్రకారమే వ్యవహరించానని అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఇప్పటివరకు విద్యార్థులు, సిబ్బంది సహా పలువురి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ, ఎలక్ట్రానిక్ ఆధారాలు, ఇతర రికార్డులను పరిశీలిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కోసం ఐఐటీ బాంబే కూడా 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!