

‘స్టార్ ట్రెక్’, ‘ఎక్స్-మెన్’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ బ్రిటిష్ నటుడు సర్ పాట్రిక్ స్టువర్ట్ (86) కన్నుమూశారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, అల్జీమర్స్ వ్యాధి, లూయీ బాడీ డిమెన్షియాతో కొంతకాలంగా పోరాడుతున్న ఆయన అక్టోబర్ 28న లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మరణించే సమయంలో భార్య సన్నీ ఒజెల్ ఆయన పక్కనే ఉన్నారు. కుటుంబ సభ్యులు, ఆప్తుల మధ్య సంగీతం, ప్రార్థనలు, నవ్వులు, కన్నీళ్ల నడుమ ఆయన చివరి క్షణాలు గడిచాయని కుటుంబం వెల్లడించింది. ఆయన మరణవార్తతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
‘స్టార్ ట్రెక్: ది నెక్స్ట్ జనరేషన్’లో కెప్టెన్ జీన్-లూక్ పికార్డ్ పాత్రతో పాట్రిక్ స్టువర్ట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అలాగే ‘ఎక్స్-మెన్’ సినిమాల్లో ప్రొఫెసర్ చార్లెస్ జేవియర్‌గా ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలతో పాటు నాటకరంగంలోనూ ఆయన విశిష్ట గుర్తింపు సంపాదించారు. రాయల్ షేక్స్‌పియర్ కంపెనీతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిత్రరంగానికి, నాటకరంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన క్వీన్ ఎలిజబెత్-II 2010లో ఆయనకు నైట్‌హుడ్ బిరుదును ప్రదానం చేశారు. ఆయన మృతిపై హాలీవుడ్ ప్రముఖులు, మార్వెల్ స్టూడియోస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు నివాళులర్పిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రంలోనూ ఆయన ప్రొఫెసర్ ఎక్స్ పాత్రలో కనిపించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!