30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

Writer: Pooja 12:09 PM, 30 అక్టోబర్, 2026
ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డంపింగ్ యార్డును తొలగించే వరకు మాత్రమే కాకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తాను పాదయాత్ర చేస్తుంటే పనిలేక తిరుగుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారంటూ ప్రస్తావించిన ఈటల.. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని అన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో వ్యర్థాల రీసైక్లింగ్‌కు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైన నిధుల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి డబ్బులు తీసుకొస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

ఈ నెల 27న ఏదులాబాద్‌లోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈటల రాజేందర్ తన పాదయాత్రను ప్రారంభించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాలు, కాలనీల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో గాలి, భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఆరోపిస్తూ, డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..
ట్యాగ్లు
ఈటల రాజేందర్జవహర్ నగర్ డంపింగ్ యార్డుబీజేపీరేవంత్ రెడ్డి ప్రభుత్వంవ్యర్థాల రీసైక్లింగ్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూసీ పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదు.. పేదల ఇళ్లను కూల్చొద్దు: రాంచందర్ రావు
రాజకీయాలు

మూసీ పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదు.. పేదల ఇళ్లను కూల్చొద్దు: రాంచందర్ రావు

రెండో రోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన..
జనరల్

రెండో రోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన..

చలికాలంలో పెరుగు తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే..
ఆరోగ్యం

చలికాలంలో పెరుగు తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే..

మియాపూర్‌ భూములు ప్రభుత్వానివే.. కోట్ల విలువైన భూములను కాపాడాం: సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

మియాపూర్‌ భూములు ప్రభుత్వానివే.. కోట్ల విలువైన భూములను కాపాడాం: సీఎం రేవంత్‌ రెడ్డి

బాసెల్ టోర్నీలో జకోవిచ్‌కు షాక్.. స్ట్రఫ్ చేతిలో ఓటమి
క్రీడలు

బాసెల్ టోర్నీలో జకోవిచ్‌కు షాక్.. స్ట్రఫ్ చేతిలో ఓటమి

టోల్‌ప్లాజాల సమీప నివాసులకు గుడ్‌న్యూస్..
జనరల్

టోల్‌ప్లాజాల సమీప నివాసులకు గుడ్‌న్యూస్..

కోర్టు విచారణ వీడియోల అక్రమ అప్‌లోడింగ్‌పై చర్యలు తీసుకోండి.. MeitYకి సుప్రీంకోర్టు ఆదేశం
జనరల్

కోర్టు విచారణ వీడియోల అక్రమ అప్‌లోడింగ్‌పై చర్యలు తీసుకోండి.. MeitYకి సుప్రీంకోర్టు ఆదేశం

సూర్య ‘సీన్‌’తో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలకు ఛాన్స్
సినిమాలు

సూర్య ‘సీన్‌’తో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలకు ఛాన్స్

సామూహిక సమాధుల తవ్వకంపై అమెరికా సైనికులకు శిక్షణ..
జనరల్

సామూహిక సమాధుల తవ్వకంపై అమెరికా సైనికులకు శిక్షణ..

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..
రాజకీయాలు

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..
రాజకీయాలు

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

భారత నౌకాదళానికి  అత్యాధునిక యుద్ధనౌకలు..
జనరల్

భారత నౌకాదళానికి అత్యాధునిక యుద్ధనౌకలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!