

హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త అందించింది. ఇప్పటివరకు ప్రధానంగా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం వినియోగిస్తున్న లగ్జరీ పుష్పక్ ఏసీ బస్సుల్లో ఇకపై సాధారణ ప్రజలు కూడా ప్రయాణించవచ్చు. నగరంలో ఈ బస్సులు నడిచే మార్గాల్లో ప్రయాణికులు తమకు అనుకూలమైన పాయింట్ వద్ద ఎక్కి, మరో పాయింట్ వద్ద దిగే సదుపాయాన్ని కల్పించారు. విమానాశ్రయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ బస్సులను నగర ప్రయాణాలకు ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్రయాణానికి కనీస ఛార్జీగా రూ.100ను ఆర్టీసీ నిర్ణయించింది. ట్రాఫిక్ రద్దీ, ఎండల నుంచి ఉపశమనం పొందుతూ సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. ఇప్పటివరకు ఎయిర్‌పోర్ట్ ప్రయాణాలకే పరిమితమైనట్లు భావించిన పుష్పక్ బస్సులు అందుబాటులోకి రావడంతో నగర ప్రయాణికులకు మరో లగ్జరీ రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లయింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!