30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

Writer: Harika S 12:17 PM, 30 అక్టోబర్, 2026
రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

రైతులు, సైనికులు దేశానికి రెండు కళ్లు వంటివారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైతుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, రైతును ఆర్థికంగా అభివృద్ధి చేసి రారాజుగా చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నిర్వహించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచినట్లు తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. తాజాగా 9.34 కోట్ల మంది రైతులకు రూ.18,690 కోట్లను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 30 లక్షల మందికిపైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతుల్లో 92 శాతం మంది ఆ మొత్తాన్ని వ్యవసాయ అవసరాలకే వినియోగిస్తున్నారని, 85 శాతం మంది రైతుల ఆదాయం పెరిగిందని వివరించారు.

ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ.18 వేల వరకు ఆదా అవుతోందని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో దాదాపు 40 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామని, వాటి ద్వారా రూ.50 వేల కోట్ల రుణాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో 1.10 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగు సాధ్యం కాలేదని, ఈ సీజన్‌లో దాదాపు రూ.20 వేల కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు అంచనా ఉందని తెలిపారు. రైతులకు మేలు చేసే కొత్త వంగడాలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. భారతదేశం వరి ఎగుమతుల్లో అగ్రస్థానానికి చేరడంలో మోదీ కృషితో పాటు శాస్త్రవేత్తల పరిశోధనలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు రైతులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని, రైతు ముఖంలో చిరునవ్వే శాస్త్రవేత్త విజయానికి నిజమైన గుర్తింపు అని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..
ట్యాగ్లు
బండి సంజయ్నరేంద్ర మోదీపీఎం కిసాన్రైతుల సంక్షేమంవ్యవసాయ బడ్జెట్ఎరువుల సబ్సిడీతెలంగాణ వ్యవసాయంఎల్‌నినో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూసీ పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదు.. పేదల ఇళ్లను కూల్చొద్దు: రాంచందర్ రావు
రాజకీయాలు

మూసీ పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదు.. పేదల ఇళ్లను కూల్చొద్దు: రాంచందర్ రావు

రెండో రోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన..
జనరల్

రెండో రోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన..

చలికాలంలో పెరుగు తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే..
ఆరోగ్యం

చలికాలంలో పెరుగు తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే..

మియాపూర్‌ భూములు ప్రభుత్వానివే.. కోట్ల విలువైన భూములను కాపాడాం: సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

మియాపూర్‌ భూములు ప్రభుత్వానివే.. కోట్ల విలువైన భూములను కాపాడాం: సీఎం రేవంత్‌ రెడ్డి

బాసెల్ టోర్నీలో జకోవిచ్‌కు షాక్.. స్ట్రఫ్ చేతిలో ఓటమి
క్రీడలు

బాసెల్ టోర్నీలో జకోవిచ్‌కు షాక్.. స్ట్రఫ్ చేతిలో ఓటమి

టోల్‌ప్లాజాల సమీప నివాసులకు గుడ్‌న్యూస్..
జనరల్

టోల్‌ప్లాజాల సమీప నివాసులకు గుడ్‌న్యూస్..

కోర్టు విచారణ వీడియోల అక్రమ అప్‌లోడింగ్‌పై చర్యలు తీసుకోండి.. MeitYకి సుప్రీంకోర్టు ఆదేశం
జనరల్

కోర్టు విచారణ వీడియోల అక్రమ అప్‌లోడింగ్‌పై చర్యలు తీసుకోండి.. MeitYకి సుప్రీంకోర్టు ఆదేశం

సూర్య ‘సీన్‌’తో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలకు ఛాన్స్
సినిమాలు

సూర్య ‘సీన్‌’తో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలకు ఛాన్స్

సామూహిక సమాధుల తవ్వకంపై అమెరికా సైనికులకు శిక్షణ..
జనరల్

సామూహిక సమాధుల తవ్వకంపై అమెరికా సైనికులకు శిక్షణ..

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..
రాజకీయాలు

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..
రాజకీయాలు

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

భారత నౌకాదళానికి  అత్యాధునిక యుద్ధనౌకలు..
జనరల్

భారత నౌకాదళానికి అత్యాధునిక యుద్ధనౌకలు..