
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ సృష్టించిన విధ్వంసంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఒడిశాలో నెలకొన్న పరిస్థితులపైనా ఆయన ఆవేదన తెలిపారు. ఈ ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తుఫాన్, వరదల ప్రభావంతో ఇళ్లు, జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సంఘీభావం తెలిపారు.
ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలన్నింటికీ ప్రభుత్వాలు తక్షణ సహాయం అందించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన ప్రజలు త్వరగా సాధారణ జీవితం ప్రారంభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయక కార్యక్రమాల్లో జాప్యం లేకుండా బాధితులకు అవసరమైన ఆర్థిక, ఇతర సహాయాన్ని అందించాలని ఆయన కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!