

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కెప్టెన్సీ, అల్టిమేట్ గోట్ టైటిల్ కోసం జరుగుతున్న పోటీ కీలక మలుపు తిరిగింది. కెప్టెన్సీ కంటెండర్‌గా అర్హత సాధించలేకపోయినందుకు గతంలో విధించిన పనిష్మెంట్ ఇంకా పూర్తికాలేదని, అందువల్ల అమన్ ఈ పోటీలో ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదని బిగ్‌బాస్ స్పష్టం చేశారు. గ్రీన్ లెవల్‌కు చేరుకోవడానికి గత టాస్కుల్లో ఎంతో కష్టపడినప్పటికీ, ఇప్పుడు కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం కోల్పోవడంతో అమన్ నిరాశకు గురయ్యాడు. అతడికి అన్యాయం జరిగిందని భావిస్తున్న అభిమానులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పోటీలో పాల్గొనేందుకు ముగ్గురు సపోర్టర్లను ఎంపిక చేసుకునే విషయంలో హౌస్‌లో విభేదాలు మొదలయ్యాయి. వంశీ పాల్గొంటే తాను ఆడనని నీతూ నటరాజ్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు తమ టీమ్‌కు అమన్ అవసరం లేదని వర్షిణి వ్యాఖ్యానించింది. రోహిత్ కూడా అమన్ స్థానంలో ఝాన్సీని ఎంపిక చేయాలని సూచించడంతో అమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అమన్, రోహిత్ మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. కెప్టెన్సీ పోటీలో అవకాశం కోల్పోవడంతో పాటు తోటి కంటెస్టెంట్స్ నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం అమన్‌కు మరింత ఇబ్బందిగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!