
క్రీడలు

ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో శనివారం సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అనంతరం ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉంది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఇది దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని IMD వెల్లడించింది.
ప్రస్తుతం కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. IMD తాజా హెచ్చరికల ప్రకారం కోస్తాంధ్రలో సెప్టెంబర్ 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం క్రమంగా బలపడే కొద్దీ వర్షాలపై ప్రభావం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!