
సినిమాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తోంది. గతంలో 33 రకాల సన్నాలకు బోనస్ చెల్లించగా, ఈ సీజన్ నుంచి కేవలం ఏడు రకాలకే పరిమితం చేసింది. అధిక దిగుబడి, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేందుకు విత్తన మేళాలు నిర్వహిస్తున్నారు.
బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, కేఎన్‌ఎం-1638, జైశ్రీరామ్, హెచ్‌ఎంటీ సోనా, వరంగల్-44, కేఎన్‌ఎం-7715 రకాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుంది. 2024లో 70 శాతం సన్న వరి సాగుకు రూ.105 కోట్ల బోనస్ చెల్లించగా, 2025లో 85 శాతానికి పెరిగి రూ.130 కోట్లకు చేరింది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నాణ్యమైన సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!