
సినిమాలు

తాను ప్రధానిగా కొనసాగుతున్నంతకాలం పాలస్తీనా దేశం ఏర్పడబోదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికను కూడా ఆయన తిరస్కరించారు. గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్న సమయంలో నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 15 అంశాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడం అందులోని ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటి. ఈ ప్రణాళికకు పాలస్తీనాతో పాటు పలు గల్ఫ్ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే నెతన్యాహు తాజా వైఖరి శాంతి ప్రయత్నాలకు సవాలుగా మారే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!