
జనరల్

వైజాగ్ ఇనార్బిట్ మాల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన AAA సినిమాస్ అధికారికంగా ప్రారంభమైంది. ఎనిమిది స్క్రీన్లతో రూపొందిన ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్‌లో నేటి నుంచి ప్రేక్షకులకు సినిమా షోలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వైజాగ్‌లో ప్రీమియం సినిమా అనుభూతికి మరో కొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది.

AAA సినిమాస్‌లో ప్రేక్షకుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్క్రీన్ 1లో 40 ప్రీమియం రిక్లైనర్ సీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, స్క్రీన్స్ 5, 7లో పెద్ద తెరలను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్క్రీన్లలో ఒక్కో థియేటర్‌కు 200 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఆధునిక సదుపాయాలతో AAA సినిమాస్ వైజాగ్‌లో సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!