

జైపూర్‌లో ఆగస్టు 6 నుంచి 9 వరకు జరుగుతున్న 42వ సబ్-జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ 2026లో తెలంగాణ యువ స్విమ్మర్లు సత్తాచాటారు. బాలుర 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో ఆరుష్ దాస్ 29.44 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి తెలంగాణకు కాంస్య పతకం అందించాడు. ఈ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కృషివ్ దోషి, కర్ణాటకకు చెందిన శ్లోక్ సునీల్ జాదవ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఆరుష్‌కు ఇది తొలి జాతీయ స్థాయి పతకం కావడంతో ఈ విజయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో తెలంగాణకు చెందిన శివాని కర్ర 1:01.28 సెకన్ల టైమింగ్‌తో రజత పతకం సాధించింది. తమిళనాడుకు చెందిన ధివాశ్రీ కేశవన్ 1:00.23 సెకన్లతో స్వర్ణం, కేరళకు చెందిన ఇంద్రాణి ఎం. మీనన్ 1:01.66 సెకన్లతో కాంస్యం గెలుచుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హెడ్ స్విమ్ కోచ్ ఆయుష్ యాదవ్ మార్గదర్శకత్వంలో ఆరుష్ శిక్షణ పొందుతున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ ఎ. సోనిబాల దేవి, ఐఎఫ్‌ఎస్, ఆరుష్, శివాని, కోచ్ ఆయుష్ యాదవ్, వారి తల్లిదండ్రులు, కోచింగ్ మరియు సహాయక బృందాన్ని అభినందించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!