
జనరల్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంధన సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. మొత్తం 4,345 బంకుల్లో 47 మినహా మిగతా అన్నింటిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు 3,714 కిలోలీటర్ల పెట్రోల్, 7,107 కిలోలీటర్ల డీజిల్‌ను సరఫరా చేయడంతో రాష్ట్రంలో సరఫరా పరిస్థితి మెరుగుపడింది.
అయితే కొన్ని జిల్లాల్లో ఇంకా కొంతమంది బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, కడప జిల్లా, తిరుపతి జిల్లా ప్రాంతాల్లో మూతపడిన బంకులకు స్టాక్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!