

ఆందోళనలు, నిరసనల సమయంలో పరిస్థితులు అదుపుతప్పినప్పుడు జన సమూహాలను నియంత్రించేందుకు భద్రతా బలగాలు ఉపయోగించే పెల్లెట్ గన్లపై పూర్తిస్థాయి నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే వాటి వినియోగంలో దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వస్తే, ప్రతి కేసును విడివిడిగా పరిశీలించవచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఇటీవల జంతర్‌మంతర్ వద్ద జరిగిన ‘చలో పార్లమెంట్’ నిరసనలో విద్యార్థులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) వినియోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన రికార్డులను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీస్ పరిశోధన, అభివృద్ధి విభాగం (బీపీఆర్‌డీ) మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లోనే పెల్లెట్ గన్లను వినియోగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. మెటాలిక్ పెల్లెట్ గన్లను పూర్తిగా నిషేధించాలన్న పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!