

దర్శకుడు సాయి రాజేష్ నటుడు సంపూర్ణేష్ బాబు గురించి ఆసక్తికరమైన, భావోద్వేగభరితమైన విషయాలను పంచుకున్నారు. ఎన్నో కష్టాల తర్వాత విడుదలైన 'హృదయ కాలేయం' సినిమా ఘన విజయం సాధించడం చారిత్రక ఘట్టమని ఆయన అన్నారు. సినిమా విజయంతో సంపూర్ణేష్ బాబుకు మంచి పారితోషికం రావడంతో పాటు సిద్ధిపేటలో మూడు, నాలుగు అంతస్తుల ఇల్లు నిర్మించుకుని, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కూడా కొనుగోలు చేశారని తెలిపారు. అదే సమయంలో తాను మాత్రం నానో కారు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌తో జీవించానని గుర్తు చేసుకున్నారు.
తన పరిస్థితిని గమనించిన సంపూర్ణేష్ బాబు, ఎవరికీ తెలియకుండా తన కోసం రూ.6 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించి హోండా కారును కొనిపెట్టారని సాయి రాజేష్ వెల్లడించారు. అలాగే 2018లో సంపూర్ణేష్ బాబు భార్య సూచనతో మణికొండలోని ఒక అపార్ట్‌మెంట్‌కు రూ.12 లక్షల డౌన్‌పేమెంట్ కూడా చెల్లించారని, మిగిలిన మొత్తాన్ని తాను చెల్లించాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. తమ స్నేహం జీవితాంతం కొనసాగుతుందని, ఏ పరిస్థితుల్లోనైనా ఒకరికి ఒకరు అండగా ఉంటామని సాయి రాజేష్ అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!