
సినిమాలు

అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్ మీట్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అభిమానులతో నేరుగా మమేకమై మాట్లాడిన బన్నీ స్టైల్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోలు తమ అభిమానులతో ఈ విధంగా ప్రత్యక్షంగా కలవడం అరుదుగా కనిపిస్తుండగా, బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేకంగా నిలిచింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులు తమకు ఇష్టమైన హీరోలను ట్యాగ్ చేస్తూ ఇదే తరహా ఫ్యాన్ మీట్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి కనీసం ఒక్కసారైనా అభిమానులను కలవాలని కోరుతున్నారు. ఏడాదికి ఒక సినిమా కోసం శ్రమిస్తున్న స్టార్ హీరోలు ఇకపై అభిమానులతో ప్రత్యేకంగా కలిసే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభిస్తారో లేదో చూడాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!