

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్ పంపిన ఆయన.. కేసును సీబీసీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సూచించారు. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు సమయంలో దర్యాప్తునకు సహకరించే పరిస్థితి, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, పరారయ్యే అవకాశాలను పరిశీలించారా? అని ప్రశ్నలు లేవనెత్తారు.
కేసులో మొదట నమోదైన ఫిర్యాదులు, అనంతరం రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన ఆరోపణల మధ్య తేడాలపై కూడా నాగేశ్వరరావు ప్రశ్నలు సంధించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. దర్యాప్తు తీరుపై తలెత్తుతున్న సందేహాలకు స్వతంత్ర విచారణ ద్వారానే సమాధానం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని నాగేశ్వరరావు గతంలోనూ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!