12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

Writer: Chandrika 05:21 PM, 27 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’ మూడో ఎడిషన్‌కు భారీ స్పందన లభించింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL), సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హుస్సేన్‌సాగర్ తీరంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద 35 వేల మందికి పైగా పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, ముందస్తు గుర్తింపు ప్రాధాన్యం, మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై చైతన్యం కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా కార్యక్రమం సాగింది. 21కే హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగులు నిర్వహించారు. చిన్నారుల నుంచి వృద్ధులు, దివ్యాంగుల వరకు వివిధ వర్గాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. 21కే హాఫ్ మారథాన్‌లో అమెరికా, ఇంగ్లాండ్, యూఏఈ, ఇథియోపియా, ఉగాండా, శ్రీలంక, ఐస్‌లాండ్, టాంజానియా, బోట్స్వానా, కెన్యా, కెనడా తదితర దేశాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు.

తెలంగాణ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), డీజీపీ సీవీ ఆనంద్, ఎంఈఐఎల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా రెడ్డి తదితరులు రన్‌ను ప్రారంభించారు. సినీ నటుడు సిద్దు జొన్నలగడ్డ, మాజీ ప్రపంచ సుందరి ఓపల్ సుచేత, ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు పాల్గొని రన్నర్లలో ఉత్సాహం నింపారు. వివిధ విభాగాల్లో విజేతలకు మొత్తం రూ.75 లక్షల నగదు బహుమతులు అందించారు. 21కే హాఫ్ మారథాన్‌లో పురుషుల విభాగంలో సునీల్ కుమార్, మహిళల విభాగంలో సోనమ్ విజేతలుగా నిలిచారు. 10కేలో హరీష్ షరీన్, వందన పటేల్, 5కేలో లవ్ చౌధరి, అంజలి తొలి స్థానాలు సాధించారు. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. థమన్ లైవ్ మ్యూజిక్ కార్యక్రమంతో రన్నర్లలో మరింత ఉత్సాహం నింపారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ కూడా 10కే రన్‌లో పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

ట్యాగ్లు
పింక్ పవర్ రన్పింక్ పవర్ రన్ 3.0హైదరాబాద్రొమ్ము క్యాన్సర్ అవగాహనసుధా రెడ్డి ఫౌండేషన్ఎంఈఐఎల్మహిళల ఆరోగ్యంఫిట్‌నెస్ రన్హుస్సేన్‌సాగర్హాఫ్ మారథాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!