

హైదరాబాద్‌లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు టీ-జీ సేఫ్ అధికారులు జారీ చేసిన నోటీసులను బేఖాతరు చేస్తున్నట్లు సమాచారం. నిన్న నగరంలోని పలు హోటళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించిన ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో కొన్ని హోటళ్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని హోటళ్ల నిర్వాహకులు వాటిని పట్టించుకోకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గచ్చిబౌలిలోని అంతెరా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఇవాళ రెస్టారెంట్‌ను తిరిగి తెరిచినట్లు తెలుస్తోంది. తనిఖీల సందర్భంగా పురుగులు పట్టిన ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ, వాటిని తినేందుకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. లైసెన్స్ రద్దు చేసిన తర్వాత కూడా హోటళ్లు, రెస్టారెంట్లు కొనసాగడంపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!