
జనరల్

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో నిర్వహించే సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2027లో జరిగే మినీ జాతరను ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు మేడారం పూజారుల (వడ్డెల) సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత మంత్రులకు లేఖ ద్వారా జాతర తేదీలను తెలియజేశారు.
2027 ఫిబ్రవరి 17 (బుధవారం) నుంచి 20 (శనివారం) వరకు నాలుగు రోజుల పాటు అమ్మవార్ల ఉత్సవాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జాతర తేదీలను ధ్రువీకరిస్తూ పూజారుల సంఘం నాయకులు, వడ్డెలు లేఖపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!