
బిజినెస్

విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. నున్న సీఐ అలీ విధుల్లో ఉండగానే ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు సమాచారం. గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలినట్లు సమాచారం.
వెంటనే తోటి పోలీసు సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. విధుల్లో ఉండగానే సీఐ అలీ మృతి చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచర అధికారులు, సిబ్బంది ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!