

భారత మార్కెట్లో పెరుగుతున్న స్పోర్ట్స్ బైకుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని యమహా మోటార్స్ ఈ సెగ్మెంట్‌లోకి మరోసారి బలంగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. 250సీసీ నుంచి 1000సీసీ సామర్థ్యం కలిగిన పలు బైక్‌లను దేశీయ మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు యమహా ఇండియా చైర్మన్ హజిమే ఓటా తెలిపారు. ఇటీవల 200సీసీ ఇంజిన్‌తో కూడిన ఆర్2 మోడల్‌ను సంస్థ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న తనెరా 700, ఎక్స్‌ఎస్‌ఆర్900, ఎంటీ-07, ఎంటీ-09, ఆర్3, ఆర్7, ఆర్9 మోడళ్లను కూడా భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది.
గతేడాది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆర్7, తనెరా 700 మోడళ్లను యమహా ప్రదర్శించింది. వీటిలో తనెరా 700ను ప్రీమియం అడ్వెంచర్ బైక్ విభాగంలో తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. ఈ బైక్‌లో 689సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో పాటు లీన్-సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, వైసీసీ-టీ ఎలక్ట్రానిక్ థ్రాటిల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!