
జనరల్

ప్రతిష్టాత్మక ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన తొలి చిత్రాన్ని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ భవనం వద్ద ప్రదర్శించిన ఈ హైస్పీడ్ రైలు నమూనా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పక్షి ఆకారం నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్ రూపొందించినట్లు సమాచారం.
గంటకు సుమారు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనున్న ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం ఏడు గంటల నుంచి కేవలం రెండు గంటలకు తగ్గనుంది. మొత్తం 12 స్టేషన్లతో ఈ కారిడార్ రూపుదిద్దుకోనుండగా, తొలి దశలో సూరత్-బిలిమోరా మధ్య 100 కిలోమీటర్ల విభాగాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!