
జనరల్

విశాఖపట్నం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో బోటు యజమాని చిన్నయ్యను ఓ నౌక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అయితే మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం కోస్ట్‌గార్డ్ ఆధ్వర్యంలో విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు, వేట ముగించుకుని నిన్న మధ్యాహ్నం తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అనంతరం వారి సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మత్స్యకారులు వేటాడిన ప్రాంతంలో కోస్ట్‌గార్డ్, మెకనైజ్డ్ బోట్స్ యూనియన్ సభ్యులు, గజ ఈతగాళ్లు కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!