
జనరల్

విజయవాడ రైల్వేస్టేషన్లో నర్సాపూర్ నుంచి చెన్నై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని సీ4 కోచ్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురై వెంటనే కోచ్ నుంచి బయటకు దిగారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20678) బుధవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకుందని రైల్వేశాఖ తెలిపింది. అదే సమయంలో సీ4 కోచ్‌లో హాట్ యాక్సిల్ ఉన్నట్లు సిబ్బంది గుర్తించినట్లు వెల్లడించింది. సమస్యను గుర్తించిన వెంటనే సిబ్బంది చర్యలు చేపట్టి మంటలను అదుపు చేసినట్లు పేర్కొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!