

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం దేశంలోనే వినూత్నమైన పథకమని అన్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 85 శాతం మందికి కడుపునిండా సన్నబియ్యం తినే అవకాశం కల్పించడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇంత విస్తృత స్థాయిలో ఈ పథకం అమలు కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో సన్నబియ్యం పథకం ద్వారా అర్హులైన రేషన్ కార్డుదారులకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు.
భారాస ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాజకీయ అంశాలపై స్పందించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని అన్నారు. భాజపా ఓటు చోరీకి పాల్పడుతోందని రాహుల్‌గాంధీ ధైర్యంగా ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!