

హైదరాబాద్‌లోని రాంనగర్‌లో అలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ నినాదంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర చేపట్టనున్న హెచ్‌సీజీ (హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్) సభ్యులను ఘనంగా సత్కరించారు. నవంబర్ 19న శ్రీనగర్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్రలో భాగంగా 3,700 కిలోమీటర్ల దూరాన్ని 21 రోజుల్లో పూర్తి చేయాలని సైక్లిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలై బలై ఫౌండేషన్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై సైక్లిస్టులను సన్మానించారు. ఈ బృందంలో ఒక మహిళా సైక్లిస్ట్ కూడా పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌ను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. సైక్లింగ్‌తో శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు చేపడుతున్న ఈ యాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్, నషా ముక్త్ తెలంగాణ స్ఫూర్తితో సాగుతున్న ఈ యాత్ర విజయవంతం కావాలని, సైక్లిస్టుల ప్రయాణం సురక్షితంగా సాగాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!