
సినిమాలు

వరుస వివాదాల నేపథ్యంలో రిమ్స్ (RIMS) డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో రిమ్స్ నూతన డైరెక్టర్‌గా బలిరాం చిట్కేను ప్రభుత్వం నియమించింది. జైసింగ్ రాథోడ్‌ను నాగర్‌కర్నూల్ వైద్య కళాశాల ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, రిమ్స్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకట్ లకావత్‌ను నియమించింది. వరుస వివాదాల నేపథ్యంలో రిమ్స్ ఉన్నతాధికారుల మార్పులు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నియామకాలు, బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ఉత్తర్వుల ప్రకారం అమల్లోకి రానున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!