

ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవాలనుకునే వారికి యూఐడీఏఐ (UIDAI) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆధార్ సేవా కేంద్రాలు లేదా పోస్టాఫీసుల చుట్టూ తిరగకుండానే అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కొత్త నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవను వినియోగించుకోవాలంటే ఆధార్‌కు ఇప్పటికే లింక్ అయిన పాత మొబైల్ నంబర్ అందుబాటులో ఉండాలి.
మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవడానికి ముందుగా ఆధార్ యాప్‌లోకి లాగిన్ అయి, ‘సర్వీసెస్’ విభాగంలో ‘మొబైల్ నంబర్ అప్‌డేట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం కొత్త నంబర్‌ను నమోదు చేసి, సూచించిన విధంగా ఓటీపీ ధ్రువీకరణ, ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. చివరగా రూ.75 ఫీజు చెల్లించి అభ్యర్థనను సమర్పించాలి. పాత నంబర్ అందుబాటులో లేకపోతే లేదా ఆధార్‌కు గతంలో ఎలాంటి మొబైల్ నంబర్ నమోదు చేయకపోతే సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా అధీకృత అప్‌డేట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్‌డేట్ ప్రక్రియ పూర్తయ్యేందుకు 30 రోజుల వరకు పట్టవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!