
క్రీడలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా బలపడే సూచనలు ఉండగా, నవంబర్ 18 ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించారు. తుఫాన్‌గా రూపాంతరం చెందితే దీనికి ‘అక్వాన్’ (Aqwan)గా నామకరణం చేయనున్నారు. అనంతరం ఈ తుఫాన్ ఏపీ కోస్తా తీరం వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
నవంబర్ 20న తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు. నవంబర్ 18 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ కదలికలు, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!