

పాకిస్థాన్‌తో జరిగిన అండర్-19 వన్డే ఆసియా కప్ ఫైనల్‌లో భారత యువ జట్టు అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో గెలిచి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. పాకిస్థాన్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 50 ఓవర్లలో ఛేదించింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో మోహిత్ (49 నాటౌట్; 26 బంతుల్లో) ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని (80), ఆర్యవీర్ సెహ్వాగ్ (58), మానల్ చౌహాన్ (47) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
భారత యువ జట్టు అద్భుత విజయంపై మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆటగాళ్లు చూపిన పట్టుదల, ధైర్యం అద్భుతమని సెహ్వాగ్ కొనియాడారు. లక్ష్య రాజేశ్, ఆర్యవీర్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా.. మానల్ చౌహాన్, మోహిత్ అసాధారణ పోరాటంతో జట్టును గెలిపించారని ప్రశంసించారు. మరోవైపు, ఒత్తిడిలోనూ సంయమనం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిన యువ ఆటగాళ్లకు లక్ష్మణ్ అభినందనలు తెలిపారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తీరు గర్వంగా ఉందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!