

బాలీవుడ్ నటి కియారా అద్వానీ తన భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మాతృత్వ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. తొలి గర్భధారణ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ముఖ్యంగా మొదటి మూడు నెలలు చాలా కష్టంగా గడిచాయని, హార్మోన్లలో వచ్చిన మార్పుల వల్ల తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించారు.
గర్భధారణ విషయాన్ని మొదట్లో ఎవరికీ చెప్పకూడదని తాము నిర్ణయించుకున్నామని కియారా తెలిపారు. అయితే, ఆ సమయంలో ఎదురైన పరిస్థితులను ఒంటరిగా తట్టుకోవడం కష్టమైందని చెప్పారు. తన బాధను అర్థం చేసుకునే మహిళల తోడు అవసరమని భావించి, ఈ విషయాన్ని సిద్ధార్థ్‌తో పంచుకున్నట్లు వెల్లడించారు. తన తల్లితో పాటు అత్తగారితో కూడా మాట్లాడాలని పట్టుబట్టినట్లు వివరించారు. మాతృత్వ ప్రయాణంలో మహిళల నుంచి లభించే మద్దతు ఎంత ముఖ్యమో ఆమె వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!