

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ తమ బంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శివోన్ జిలిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎలాంటి ముందస్తు చర్చ లేకుండానే వారం రోజుల్లో ప్రేమ బంధం నుంచి విడిపోవాల్సి రావడం చాలా కష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. విడిపోవడం బాధగా ఉన్నప్పటికీ మస్క్‌పై తనకు ఉన్న అభిమానం, ప్రేమ కొనసాగుతాయని, భవిష్యత్తులో మంచి స్నేహితులుగా ఉండటంతో పాటు పిల్లలకు కలిసి తల్లిదండ్రులుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మస్క్, శివోన్ జిలిస్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించగా.. ఆ తర్వాత ఆర్కాడియా, సెల్డన్ జన్మించారు. మస్క్ సంస్థల్లో పనిచేసిన శివోన్ ప్రస్తుతం న్యూరాలింక్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమ కుటుంబం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్న ఆమె.. మస్క్ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. బ్రేకప్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు ఇద్దరూ ప్రేమతో మాట్లాడుకున్న సందేశాల స్క్రీన్‌షాట్‌లను కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పటివరకు మస్క్ ఈ విషయంపై బహిరంగంగా స్పందించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!