
జనరల్

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరిన ఎబోలా అనుమానితుడికి సంబంధించిన కేసు నెగిటివ్గా తేలింది. సుడాన్ దేశానికి చెందిన వ్యక్తిని అనుమానంతో ఆస్పత్రిలో చేర్చగా, నమూనాలను పరీక్షల కోసం సీసీఎంబీకి పంపించారు.
ల్యాబ్ పరీక్షల ఆధారంగా ఎబోలా లేదని వైద్యులు నిర్ధారించారు. నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అధికారులు, వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!