
క్రీడలు

యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. తాను బీజేపీకి మద్దతు ఇస్తానని, కానీ లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడేవారికి మాత్రం ఎప్పటికీ మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. సమస్యలపై తాను కేవలం సానుభూతి మాత్రమే చూపగలనని, పోరాడే శక్తి తనకు లేదని వెల్లడించారు. తనను ట్యాగ్ చేసి విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ అధికారులు, న్యాయవ్యవస్థను ట్యాగ్ చేసి న్యాయం కోరాలని నెటిజన్లకు సూచించారు. ఒక ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన మార్పు రాదని, నటీనటులను ట్యాగ్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయిందని అన్నారు. బండి భగీరథ్ కేసుపై స్పందించాలని సోషల్ మీడియాలో తనను ప్రశ్నిస్తుండటంతో రష్మీ ఈ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!