
రాజకీయాలు

సినిమాలు చూడటాన్ని కొందరు వినోదంగా భావిస్తే, మరికొందరికి అది జీవితంలో ఒక భాగంగా మారుతుంది. అమెరికాకు చెందిన 60 ఏళ్ల రిటైర్డ్ అధికారి గ్లెన్ వుడ్ హోస్కిన్ తన సినీ అభిరుచితో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏప్రిల్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు థియేటర్లలో ఏకంగా 1,207 సినిమాలు వీక్షించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.
ఈ లెక్కన ఆయన ఏడాది పాటు రోజుకు సగటున 3.3 సినిమాలు చూశారు. థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆయన చూపిన ఆసక్తి, అంకితభావం ఈ అరుదైన ఘనతకు కారణమయ్యాయి. సినిమాలపై అభిమానం ఉంటే ఇలాంటి రికార్డులు కూడా సాధ్యమేనని ఆయన నిరూపించారు. మరి మీరు ఏడాదిలో ఎన్ని సినిమాలను థియేటర్లలో చూస్తారు?


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!